నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... అవసరమైతే శాసనసభ్యులను మొత్తాన్ని తీసుకెళ్లి దిల్లీలో కూర్చుంటామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల అంశంపై సభలో భట్టి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేసీఆర్.... నీటి అంశంలో రాజీ లేదని తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టేలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆర్డీఎస్ విషయంలోనూ... ఏపీ ప్రభుత్వం అసంబద్ధంగా వెళ్తోందని... నీటి హక్కులను వదులుకునే ప్రసక్తి లేదన్నారు. ఆర్డీఎస్ నుంచి 15.9 టీఎంసీల నీటిని కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.