కరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సకు అనుమతిచ్చారు.
ప్రైవేటులో కరోనా పరీక్షలు, చికిత్సకు మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
30 నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, చుట్టుపక్కన 4 జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలన్న సీఎం... పాజిటివ్‌గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించాలని తెలిపారు. బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కరోనాపై కేసీఆర్ సమీక్ష... మంత్రి ఈటల, అధికారులతో కీలక చర్చ