ETV Bharat / state

KCR: రాజకీయంగా లాభం కోరుకుంటాం: కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

తెరాస సన్నాసుల మఠం కాదని రాజకీయ పార్టీ అని సీఎం కేసీఆర్(KCR)​ స్పష్టం చేశారు. హుజూరాబాద్​ నేత పాడి కౌశిక్​ రెడ్డి హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో తెరాస చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

KCR
కేసీఆర్​
author img

By

Published : Jul 21, 2021, 7:55 PM IST

Updated : Jul 21, 2021, 10:15 PM IST

దళిత బంధు చూసి కొందరికి బీపీ పెరుగుతోందని సీఎం కేసీఆర్‌(KCR) అన్నారు. దళిత బంధు చూసి బీపీ పెంచుకునే వారి ధ్యాసంతా ఓటు పైనే అని విమర్శించారు. దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయని.. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చామంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాజకీయంగా లాభం జరగాలని కోరుకుంటే.. తప్పేముందని కేసీఆర్​ ప్రశ్నించారు. పని చేసిన వాడు.. ఫలితం కోరుకోవద్దా? అని అన్నారు. తెరాస సన్నాసుల మఠం కాదని.. రాజకీయ పార్టీ అని ఉద్ఘాటించారు.

హుజూరాబాద్​ నియోజకవర్గం దళిత బంధుకు ఫైలెట్​ ప్రాజెక్టుగా ఎంపికైంది. నిన్న ఒగైన నాతో అన్నడు. అడ ఎలక్షన్​ ఉన్నదని గందుకే దళిత బంధు పెట్టిర్రని... ఎందుకు పెట్టం వయ్యా... తెరాస ఏమన్న సన్నాసుల మఠమా.. తెరాస రాజకీయ పార్టే కాదా.. రాజకీయకంగా లాభం జరగాలని కచ్చితంగా కోరుకుంటాం.

-కేసీఆర్​, సీఎం

KCR: రాజకీయంగా లాభం కోరుకుంటాం: కేసీఆర్​

ఇదీ చదవండి:

CM KCR: 'ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తున్నాం'

koushik reddy: తెరాసలో చేరిన పాడి కౌశిక్​ రెడ్డి

Last Updated : Jul 21, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.