కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈనెల 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని, ఆ తరువాతనే అవసరాల మేరకు సడలింపులు ఉంటాయని చెప్పారు. లాక్‌డౌన్, పేదలకు సాయంలో ప్రజాప్రతినిధుల చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సూచించారు.
ఎంత మందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. కొవిడ్-19 వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.