ETV Bharat / state

వ్యవసాయంలో అంతర్జాతీయ డిమాండ్​ రావాలి: కేసీఆర్​ - వ్యవసాయంపై సీఎం కేసీఆర్​ సమీక్ష తాజా వార్తలు

నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణకు బ్రాండ్​ ఇమేజ్​, అంతర్జాతీయ డిమాండ్​ రావాలని సీఎం కేసీఆర్​ అభిలాషించారు. వ్యవసాయంలో మార్పులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్​లో రాష్ట్ర వ్యవసాయం రూపురేఖలు మారాలని కోరారు. రైతుల పంటలకు విలువ జోడించేలా ఫుడ్​ ప్రాసెసింగ్​ సెజ్​లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

వ్యవసాయంలో రాష్ట్రానికి అంతర్జాతీయ డిమాండ్​ రావాలి: కేసీఆర్​

author img

By

Published : May 22, 2020, 11:12 PM IST

Updated : May 23, 2020, 6:26 AM IST

వ్యవసాయంలో మార్పులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్​.. అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, మార్కెటింగ్‌ నిపుణులతో సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్షించారు. పంటల సాగు, అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలు.. ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని సీఎం సూచించారు.

భవిష్యత్​లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలకు ముడిసరుకు నిరంతరం అందేలా పంటలు ఉండాలన్నారు. రైతుల పంటలకు విలువ జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ డిమాండ్‌ రావాలని కేసీఆర్​ అభిలాషించారు.

"ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి. వ్యాపారుల మాట నమ్మి రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడుతున్నారు. క్రాప్ కాలనీలు ఉన్నచోటే అగ్రో ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి."

-కేసీఆర్​, సీఎం

ఇదీ చూడండి : మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Last Updated : May 23, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.