వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమీక్షించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై ఆదివారం సమీక్షలో ప్రధానంగా సీఎం చర్చించనున్నారు.
వీలైనంత త్వరగా ధరణిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్