ETV Bharat / state

నేడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం సమీక్ష - తెలంగాణలో కరోనా తాజా సమాాచారం

కరోనా పరిస్థితులు, లాక్​డౌన్​తో పాటు సడలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. 29వరకు లాక్​డౌన్ పొడిగించిన ప్రభుత్వం... సడలింపుల విషయంలో ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతోన్న కారణంగా సీఎం సమీక్ష ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సహా ఇతర సేవలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

cm kcr review meeting on corona
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం సమీక్ష
author img

By

Published : May 16, 2020, 6:01 AM IST

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు ఇప్పటికే పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం... సడలింపులు సహా సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యంతర సమీక్ష చేపట్టనుంది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు.

జిల్లాల్లో తగ్గుతున్నాయి... గ్రేటర్​లో పెరుగుతున్నాయి

ప్రస్తుతం జిల్లాల్లో కొత్త కేసులు రానప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, నియంత్రణా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.

జిల్లాల పరిస్థితిపై చర్చ

రాష్ట్రంలో ఈ నెల 29వ వరకు లాక్​డౌన్ పొడిగించినా... ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో కొన్నింటిని రాష్ట్రంలోనూ ఇప్పటికే అమలు చేస్తున్నారు. గ్రీన్ జోన్లలో సగం సామర్థ్యంతో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చినప్పటికీ రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. సడలింపులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపైనా సమీక్షలో చర్చిస్తారు. హైదరాబాద్​తో పాటు జిల్లాల్లో పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చిస్తారు.

రాజధాని విషయంలో...

రాజధానిలో కేసులు పెరుగుతున్న కారణంగా నగరంలో ఆంక్షలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సహా ఇతర సేవలకు అనుమతుల విషయమై కూడా ఇవాళ్టి సమావేశంలో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: 'ఇద్దరు సీఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.