ETV Bharat / state

ఇంకొంత కాలం లాక్​డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్ - HIGHER OFFICIALS

హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు చేపట్టిన లాక్​డౌన్​ అమలుపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మరి కొద్ది రోజులు కఠిన లాక్​డౌన్ పాటించాలని ప్రజలకు సూచించారు.

లాక్ డౌన్ అమలుపై  ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Apr 26, 2020, 9:45 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్​డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్​కు సహకరించాలని కోరారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్​లో దేశ పరిస్థితిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. భవిష్యత్ చర్యలు ఎలా ఉండాలనే విషయంలో రేపటి కాన్ఫరెన్స్​లో అభిప్రాయాలు వ్యక్తమవుతాయన్నారు.

ఆ రెండు తప్పనిసరిగా కొనసాగాలి...

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరకులు అందచేయాలని సీఎం ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువ ఉండటం ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, భౌతిక దూరం కొనసాగించడం ద్వారా వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికట్టవచ్చని సీఎం అన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.