ETV Bharat / state

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో చర్చించిన సీఎం.. అలా చేయాలని సూచన! - CM KCR REVIEW

CM KCR REVIEW: రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్​కుమార్​, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం.. ఆర్థిక స్థితిగతులపై చర్చించారు.

ఖజానాకు వస్తున్న ఆదాయంపై సమీక్షించిన సీఎం.. అధికారులకు ఆ సూచన..!

author img

By

Published : Jun 2, 2022, 4:59 AM IST

CM KCR REVIEW: రుణాలకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి లభించని తరుణంలో ఖజానాకు వస్తున్న ఆదాయం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం.. ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. కేంద్రం అడిగిన అన్ని వివరాలు, సమాచారం అందించామని.. దిల్లీ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

గత రెండు నెలల ఆదాయం, ప్రస్తుత నెల ఆదాయ అంచనా వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుత నెలలో అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయం పెంపు కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అవసరమైన మేర సర్దుబాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గత నెల తరహాలోనే ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. మొదటి రోజైన బుధవారం రూ.1,000 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. పల్లె, పట్టణప్రగతికి సంబంధించిన నిధులు కూడా గత రెండు రోజులుగా బాగానే చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఇదీ చూడండి..

నిఖత్‌, ఇషా సింగ్‌తో పాటు మొగిలయ్యకు సర్కారు నగదు నజరానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.