ETV Bharat / state

CM KCR Released BRS MLAs Candidate List : 'రాష్ట్ర ప్రగతిని కొనసాగించాలనేదే అజెండా'.. అక్టోబర్​ 16న వరంగల్​లో సింహగర్జన సభ

CM KCR Released BRS MLAs Candidate List : వచ్చే శాసనసభ ఎన్నికకు బీఆర్​ఎస్​ సమర శంఖం పూరించింది. 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ.. సీఎం కేసీఆర్​ అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్టోబర్​ 16న వరంగల్​లో జరిగే సింహగర్జన సభతో.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. మజ్లిస్​తో బీఆర్​ఎస్​ స్నేహం కొనసాగుతుందని వివరించారు.

BRS MLAs Candidate List 2023
CM KCR Released BRS MLAs Candidate List
author img

By

Published : Aug 21, 2023, 8:01 PM IST

CM KCR Released BRS MLAs Candidate List రాష్ట్ర ప్రగతిని కొనసాగించాలనేదే అజెండా.. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్​

CM KCR Released BRS MLAs Candidate List : రాష్ట్రప్రగతిని కొనసాగించాలనే అజెండాతోనే ఎన్నికలకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)​ ప్రకటించారు. ఇతర పార్టీలకు ఎన్నికలు పొలిటికల్‌ గేమ్‌ అని, బీఆర్​ఎస్(BRS)​కు మాత్రం పవిత్ర యజ్ఞమని పునరుద్ఘాటించారు. 95 నుంచి 105స్థానాలు గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనని సీఎం అన్నారు. అక్టోబర్‌ 16న వరంగల్‌లో జరిగే సింహగర్జన వేదికగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని ప్రకటించారు. మజ్లిస్‌(Majlis)తో స్నేహం కొనసాగుతుందన్న కేసీఆర్​.. 17ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

అంసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థుల్ని(KCR announced 115 BRS candidates) ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. పార్టీ అజెండా, ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. కొత్త రాష్ట్రమైననప్పటికీ, వనరులు తక్కువగా ఉన్నప్పటికీ, అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వజ్రంలా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. అభివృద్ధికి కొలమానంగా చూసే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగంలో అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. ఈ ప్రగతిని కొనసాగించాలనే అజెండాతో ఎన్నికలకు వెళుతున్నామని.. 95 నుంచి 105 స్థానాలు గెలుస్తున్నామని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు.

"ప్రగతి ఎజెండా ఇంకా ఏమీ లేదు. కొనసాగుతున్న ప్రగతి కొనసాగించండి. ఇతర పార్టీలకు ఏమో.. ఎన్నికలంటే పొలిటికల్​ గేమ్​. బీఆర్​ఎస్​కు ఎన్నికలు అంటే పవిత్రమైన యజ్ఞం. 95 నుంచి 105 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాము." - కేసీఆర్​, ముఖ్యమంత్రి

BRS MLAs First Phase List2023 : 9ఏళ్లలో మేనిఫెస్టోలో చెప్పని అనేక పథకాల్ని(Schemes) అమలుచేశామని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఎన్నికల ముంగిట రుణమాఫీ సహా వివిధ హామీలు అమలుచేయడంలో తప్పేంటని.. తమది మఠం కాదని రాజకీయపార్టీ అని తెలిపారు. అక్టోబర్‌ 16న వరంగల్‌లో జరిగే సింహగర్జన వేదికగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని వెల్లడించారు.

"అక్టోబర్​ 16న వరంగల్​లో బీఆర్​ఎస్​ భారీ ర్యాలీ చేయనుంది. ఆరోజు అక్కడే మేనిఫెస్టో విడుదల చేస్తాం. మాకు రాజకీయ వ్యూహం ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కల్యాణ లక్ష్మీ, మిషన్​ భగీరథ, కేసీఆర్​ కిట్​ వంటివి ఇచ్చాము. మాది సన్యాసుల మఠం కాదు కదా.. రాజకీయ పార్టీ ఎన్నికల చివరలో పథకాలు ప్రవేశపెడతాం దానిలో ఏం ఉంది." - కేసీఆర్​, ముఖ్యమంత్రి

"ఎమ్మెల్యే ఎన్నికలో ఎలాగో గెలుస్తాం. 17 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యం. బీఆర్​ఎస్​, మజ్లిస్​ పార్టీలు 2014 నుంచి స్నేహ భావంతో ఉంటాయి. కలిసే పోటీ చేస్తాము. హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో 29కి 29 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తాం. కాంగ్రెస్​, బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తే.. దెయ్యాలు వేదం వల్లినట్లు ఉంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులను తెలంగాణ ప్రజలు గెలిపించాలి." - కేసీఆర్​, సీఎం

BRS MLAs Final Candidates List 2023 : 2014 నుంచి కొనసాగుతున్నట్లుగానే మజ్లిస్‌తో స్నేహం ఉంటుందని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో 29స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌, బీజేపీ అవినీతి ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఆర్​.. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని స్పష్టం చేశారు. ఉజ్వలమైన ఉత్కృష్టమైన తెలంగాణ సాధనలో భాగంగా బీఆర్​ఎస్​ అభ్యర్థుల్ని స్వీకరించాలని ప్రజల్ని కోరారు.

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.