ETV Bharat / state

యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌ - చైనాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు అవలంబించాలి: సీఎం కేసీఆర్‌

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ....దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజ‌నీతి కాదని, యుద్ధ‌నీతి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెరాస అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ పాల్గొన్నారు.

cm-kcr-participated-in-all-party-meeting-organized-by-pm-narendra-modi
యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌
author img

By

Published : Jun 19, 2020, 9:22 PM IST

Updated : Jun 19, 2020, 10:06 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం తొందరపాటు వద్దన్న కేసీఆర్.. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ... దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజ‌నీతి కాదని, యుద్ధ‌నీతి కావాలని‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెరాస అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ పాల్గొన్నారు. సుస్థిర పరిపాలన, ఆర్థిక శక్తిగా ఎదగడం, కశ్మీర్ విషయంలో... కొత్తచట్టాలు, ఆక్సాయ్‌చిన్‌ మనదేనని ప్రకటించడం సహా గల్వాన్‌ లోయలో మౌళిక సదుపాయాల అభివృద్ధి చైనాకు కంటగింపుగా మారిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

చైనా నుంచి వస్తువుల దిగుమతి ఆపాలనే అభిప్రాయాలు వస్తున్నాయన్న కేసీఆర్... అది తొందరపాటు చర్య అవుతుందని ప్రధానికి సూచించారు. దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఉత్పత్తి చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలన్న కేసీఆర్ అన్నారు.

రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. బ్రిటన్ ప్రతిపాదించిన డీ10 గ్రూపు, ఓరాన్ అలయెన్స్‌లలో చేరాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ఇదీ చూడండి: కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం

Last Updated : Jun 19, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.