గోదావరి- ప్రాణహిత కలిసిన చోట సరిపడ నీటి లభ్యత ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. జలాశయాల్లో తగినంత నీరు లేకపోయినా... సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని.. రైతులు నిశ్చింతగా ఉండొచ్చని భరోసానిచ్చారు. సింగూరు, నిజాంసాగర్‌కు నీటి కొరత ఉందని... దానిపై సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం మాత్రమే కరవు ఉంటుందని... వచ్చే ఏడాది కాళేశ్వరం జలాలు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 45 లక్షల ఎకరాలకు నీరందుతుందని సీఎం చెప్పారు.
ఇదీ చదవండిః సింగరేణి కార్మికులకు రూ. ఒక లక్షా 8వందల 99 దసరా బోనస్