అవసరం మేరకే ఏ ఛార్జీలైనా పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. సంస్థలు బతకాలి.. సేవలు పొందాలంటే కొన్నిసార్లు ఛార్జీలు పెంచకతప్పదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని ఆరోపిస్తున్న నేపథ్యంలో అప్పు తెచ్చి 24 గంటల విద్యుత్ ఇస్తున్నప్పుడు ఛార్జీలు పెరుగుతాయి సీఎం వివరించారు.
ఆర్టీసీ ఛార్జీలు ప్రజలకు చెప్పే స్వల్పంగా పెంచామని... అదే విధంగా ప్రజలతో చర్చించిన తర్వాతే విద్యుత్ ఛార్జీలు పెంచుతామని తెలిపారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ సగటు వినియోగం తెలంగాణ కంటే 700 యూనిట్ల తక్కువ ఉందని సీఎం వెల్లడించారు. తెలంగాణ 1800 యూనిట్లు వినియోగిస్తుంటే... జాతీయ సగటు 1100 యూనిట్లేనని కేసీఆర్ తెలిపారు.