ETV Bharat / state

ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలి : సీఎం కేసీఆర్​

శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు తెరాసదేనని.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సర్వేలన్నీ తమ వైపేనని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని.. యువకులు, నిరుద్యోగులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నూతన రెవెన్యూ, మున్సిపల్ చట్టాల పట్ల ప్రజల్లో అపోహలు ఉంటే తొలగించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

cm-kcr-meeting-with-public-representatives
ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలి : సీఎం కేసీఆర్​
author img

By

Published : Oct 3, 2020, 10:36 PM IST

రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అందరం కలిసి తెరాస కుటుంబంగా విజయాన్ని సాధించాలన్నారు. రానున్న శాసన మండలి, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

మంచి నేతగా ఎదగాలి..

యువకులు, నిరుద్యోగులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఉద్యమ కాలం నుంచీ యువత తెరాస వైపే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రగతిభవన్​లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండి.. సమస్యలు పరిష్కరిస్తూ మంచి నేతగా ఎదగాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజల్లో నమ్మకం సాధిస్తే.. ప్రతి ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితి ఉంటుందని వివరించారు.

నూతన చట్టాలపై అపోహలను తొలగించాలి..

రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై ప్రజల్లో అపోహలు ఉంటే తొలగించాలని పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజలను పీడిస్తోన్న అవినీతికి చరమగీతం పలికేందుకే ఈ కొత్త చట్టాలను రూపొందించామని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్​పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని కేసీఆర్ ఆరా తీయగా.. ఎల్ఆర్ఎస్ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అందుకే మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. సర్వే గడువును మరింత పెంచాలని సీఎంను కోరారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామన్న సీఎం.. అన్ని రకాల భూములు రికార్డుల్లోకి ఎక్కాల్సిందేనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించి.. ఆస్తుల నమోదుకు చొరవ తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: సీఎం సహాయనిధికి 50 లక్షలు విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.