ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్​రాజ్​కు​ రాజ్యసభ సీటు? - CM KCR may offer Rajya Sabha seat to Prakash Raj

TRS May Offer MP Seat To Prakash Raj: తెరాస జాతీయ బృందంపై అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు తెరాస తరఫున ప్రకాశ్​రాజ్​ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

CM KCR Rajya Sabha seat offer to Prakash Raj
ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం
author img

By

Published : Feb 22, 2022, 10:41 AM IST

TRS May Offer MP Seat To Prakash Raj:

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్​.. అందుకోసం జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రాజకీయ, ఇతర అంశాలపై పట్టున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ముంబయి పర్యటన సందర్భంగా ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఈ పర్యటనలో సడన్​ ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కీలక పదవి ఖాయమని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రకాశ్​రాజ్​కు కేసీఆర్ బంపర్ ఆఫర్

సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ.. యాక్టివ్​గా ఉండే ప్రకాశ్​రాజ్​కు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెరాస తరఫున ప్రకాశ్​రాజ్​ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

ప్రకాశ్​రాజ్​కు కీలక బాధ్యతలు!

ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్​ తన పదవికి రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ అయ్యారు. దీనితో ఆ సీటు ఖాళీ అయింది. జూన్​లో తెరాస సభ్యులు లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవీ కాలం ముగియనుంది.ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఖాళీల్లో ప్రకాశ్​రాజ్​కు కేటాయించి.. జాతీయ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది.

జాతీయ స్థాయి బృందంలో చోటు

ఇప్పటికే భాజపా వ్యతిరేకతతో పాటు జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడం, ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై పట్టు ఉన్న దృష్ట్యా ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి బృందంలో ఆయనకు చోటు కల్పించవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: Prakash Raj With KCR: కేసీఆర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా ప్రకాశ్​రాజ్​.. అందుకోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.