ETV Bharat / state

కర్ణాటక రైతు కుటుంబానికి 10 లక్షల సాయం చేసిన సీఎం కేసీఆర్​ - పదిలక్షల రూపాయలు సాయం

CM KCR help To karnataka Farmer సీఎం కేసీఆర్ మరోసారి రైతుల పట్ల అభిమానం చాటుకున్నారు. మరణించిన ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చి గుండెపోటుతో మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేశారు.

CM KCR help To karnataka Farmer
చెక్ అందజేస్తున్న రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
author img

By

Published : Aug 16, 2022, 8:27 PM IST

CM KCR help To karnataka Farmer ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. మరణించిన ఓ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్‌కుమార్‌ హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

తెలంగాణలో అన్నదాతలకు తెరాస ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి ఇతర పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కీలకమైన వ్యవసాయాన్ని చక్కటి లాభసాటిగా మారుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ పథకాల అమలు గురించి తెలుసుకున్న కర్ణాటక కర్షకులు సైతం తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని వెల్లడించారు. కర్ణాటకలో కూడా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 10 లక్షల రూపాయల చెక్​ను పల్లా చేతుల మీదుగా విమల్‌కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా సాయం అందేలా చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, రైతుబంధు సమన్వయ సమితి ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: దుష్ట శక్తులకు బుద్ధి చెబితేనే దేశం బాగుంటుందన్న కేసీఆర్‌

భారత సైన్యానికి సరికొత్త అస్త్రాలు, దుందుడుకు చైనాకు ఇక చెక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.