ETV Bharat / state

యాసంగి పంటల విధానంపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష - యాసంగిపై సీఎం కేసీఆర్ సమీక్ష

యాసంగి పంటల సాగు ప్రణాళికపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వానాకాలం సాగు, దిగుబడి, అంతర్జాతీయ, దేశీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేయాలని ప్రభుత్వం కోరనుంది. ప్రత్యేకించి మొక్కజొన్న సాగుచేస్తే నష్టం తప్పదని రైతులకు సర్కార్ స్పష్టం చేయనుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ, పప్పుశనగ, పెసర, మినుములు, జొన్న, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు లాంటి డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని సూచించే అవకాశం ఉంది.

cm-kcr-held-review-meeting-today-on-crop-procurement
యాసంగి పంటల విధానంపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
author img

By

Published : Oct 13, 2020, 8:19 AM IST

యాసంగి పంటల విధానంపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

విస్తారంగా కురిసిన వర్షాలు, నిండిన ప్రాజెక్టులు, చెరువుల కారణంగా రాష్ట్రంలో వానాకాలం రికార్డు స్థాయిలో పంట సాగైంది. కోటీ 34 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. నియంత్రిత విధానంలో పంటలు సాగు చేయాలన్న ప్రభుత్వ పిలుపునకు అనుగుణంగా వరి, పత్తి, కంది పంటలను అధికంగా వేశారు. మొక్కజొన్న సాగు చేయవద్దన్న సర్కార్ సూచన ప్రకారం చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. వానాకాలంలో ఏకంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించేందుకు సర్కార్ సన్నద్ధమైంది.

కళకళలాడుతున్నాయి...

ఈ ఏడాది దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ తరహా సీజన్ మళ్లీ వస్తుందో... రాదోనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అధికవర్షాల వల్ల కొన్ని చోట్ల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఒక్క నిజాంసాగర్ మినహా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి. వర్షాలు ఇంకా పడుతుండడంతో ఎగువ నుంచి ప్రవాహాలు కూడా కొనసాగుతున్నాయి. చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో యాసంగిలోనూ భారీస్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. యాసంగి సీజన్​లోనూ నియంత్రిత సాగువిధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

ఆచితూచి నిర్ణయాలు..

యాసంగి పంటల విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ అధికారులు, నిపుణులతో సమావేశం కానున్న సీఎం... రైతులు ఏం పంట సాగుచేస్తే మేలన్న విషయమై చర్చిస్తారు. రెండో పంటలోనూ వరినే ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంది. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని రైతులను కోరిన ప్రభుత్వం... యాసంగిలో మొక్కజొన్న వేసుకునేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలని భావించింది. కానీ అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో రెండో పంటగా కూడా మొక్కజొన్న సాగు శ్రేయస్కరం కాదని నిపుణులు, అధికారులు చెప్తున్నారు. ఎక్కువ నిల్వలు ఉన్న కారణంగా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు నష్టపోతారని, కనీస మద్ధతుధర వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు వాస్తవాలను వివరించి మొక్కజొన్న సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.

స్పష్టత ఇచ్చే అవకాశం...

మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సూచించనుంది. పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, పప్పుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు తదితర డిమాండ్, మద్దతుధర ఉన్న పంటలను యాసంగిలో సాగు చేయాలని ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది. ఏ పంటలు ఏ ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉన్నాయో, రైతులకు లాభదాయకంగా ఉంటాయన్న విషయమై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి యాసంగి పంటల విధానంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.