CM kcr speech on shinde: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం... కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా మంచి పని జరిగిందా అని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా రాజ్యాంగ సంస్థలను దుర్వియోగంచేస్తూ... దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ సంస్థలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ పది రాష్ట్రాలను కూల్చారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు... కూలగొడతాం మిమ్మల్ని.. అని అంటున్నారని తెలిపారు. ఎలా కూలగొడుతవ్? అని ప్రశ్నించారు.
నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గెలిచారన్న సీఎం కేసీఆర్... అక్కడ భాజపా అధ్యక్షుడు తమిళనాడులో ఏక్‌నాథ్ షిండే వస్తడని మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. షిండేలు ఎవరి కోసం.. ఎవరిని బెదిరిస్తరు? అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎవరి గొంతు నొక్కుదామనుకుంటున్నారని ప్రశ్నించారు. అందరు ఒకటై తమరి గొంతు పడితే ఎక్కడికి పోతారని అన్నారు.
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు. కూలగొడతాం మిమ్మల్ని.. ఎలా కూలగొడుతవ్? ఈ మాటలు ఎవరు మాట్లడుతారు. ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడుందని, దేన్ని కొట్టాలో ప్రజలకు తెలియదా? ప్రతి రాష్ట్రంలో ఇవే పెడబొబ్బలు. నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గెలిచిండు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు తమిళనాడులో ఏక్‌నాథ్ షిండే వస్తడని మాట్లాడుతున్నడు. షిండేలు బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. షిండే.. బొండేలు.. మాకాన చెల్లవ్ ఎవరి గొంతు నొక్కుదామనుకుంటున్నరు? అందరు ఒకటై మీ గొంతు పడితే ఎక్కడికి పోతరు? లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తిరుగుబాటు చేసి పిలుపునిస్తే.. 40, 50 రోజుల్లోనే జైలులో పుట్టిన జనతా పార్టీ జెండా ఎగుర వేసింది. అది పవర్ ఆఫ్ డెమొక్రసి. సమయం వచ్చిన సమయంలో ప్రజలు చూసిస్తరు. - కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇవీ చదవండి: