ETV Bharat / state

CM KCR: 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరుగులు పెట్టాలి' - సీఎం కేసీఆర్

CM KCR Review on Palamuru Irrigation Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన జలాశయానికి జులై వరకు, ఉద్ధండాపూర్ జలాశయానికి ఆగస్టు వరకు నీటిని ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులపై నూతన సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

CM KCR
CM KCR
author img

By

Published : May 1, 2023, 1:14 PM IST

Updated : May 1, 2023, 8:45 PM IST

CM KCR Review on Palamuru Irrigation Project: కొత్త సచివాలయంలో మొట్టమొదటి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశం అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై ఆరా తీశారు. తాగునీటి అవసరాల కోసం పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం కూలంకషంగా చర్చించారు.

సమీక్షలో భాగంగా జులై వరకు కరివెన జలాశయానికి నీళ్లు తరలించాలన్న కేసీఆర్.. ఆగస్టు వరకు ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ‘కన్వేయర్ సిస్టమ్​లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్షించిన ముఖ్యమంత్రి.. అందులో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉన్నతాధికారులతో కలిసి అక్కడే భోజనం: ఆ తరువాత సచివాలయంలో ఆరో అంతస్తులోని సీఎంవో అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో ఫర్నీచర్, ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీశారు. ప్రారంభోత్సవం మరుసటి రోజు సచివాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. మొదట యాగశాలకు చేరుకొని వేదపండితులు నిర్వహించిన ద్వితీయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నేరుగా ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు చేరుకొన్నారు.

అక్కడి నుంచి తన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, పీఆర్వో కార్యాలయాలను స్వయంగా సందర్శించి ఫర్నీచర్ తదితర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. కారిడార్లలో కలియ తిరిగిన సీఎం.. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై సమీక్ష అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు.

Telangana New Secretariat: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సెలవు ఉన్నప్పటికీ సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. సమీక్షలో జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, రామకృష్ణారావు, నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజినీర్లు, ఇంజినీర్లు సమీక్షలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.