ETV Bharat / state

CM KCR: 'విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో గురువులది కీలకపాత్ర' - ఉపాధ్యాయుల దినోత్సవం

దేశానికే తలమానికంగా రాష్ట్ర విద్యా రంగాన్ని రూపుదిద్దే మహాయజ్ఞంలో ఉపాధ్యాయులు సంపూర్ణ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు

CM KCR: రాష్ట్ర విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా రూపుదిద్దాలి

author img

By

Published : Sep 5, 2021, 4:45 AM IST

Updated : Sep 5, 2021, 5:33 AM IST

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అత్యధికంగా గురుకులాలు నెలకొల్పి విద్యావ్యవస్థను పటిష్టంగా తీర్చుదిద్దుతున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశానికే తలమానికంగా రాష్ట్ర విద్యారంగాన్ని రూపుదిద్దే మహాయజ్ఞంలో వారు సంపూర్ణ భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దడంలో గురువులది కీలకపాత్ర అని సీఎం అన్నారు. గురువుల సేవలు వెలకట్టలేనివన్నారు.

విద్యాలయాలు తిరిగి ప్రారంభమైనందున కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యనందించాలన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్​ జయంతి, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువుల సేవలు వెలకట్టలేనివని సీఎం తమ సందేశంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: BEST TEACHER: బొమ్మల టీచరమ్మ.. బోధిస్తే భలే అర్థమవుతుంది!

Last Updated : Sep 5, 2021, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.