ETV Bharat / state

నేడు సీఎం కేసీఆర్ అత్యవసర స్థాయి సమావేశం - CM KCR

దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్​డౌన్​ విధించారు. ఈ నేపథ్యంలో వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పలు కీలక అంశాలపై నేడు సీఎం అధ్యక్షతన అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. కొవిడ్​ వైరస్​ నియంత్రణపై సమీక్షించనున్నారు.

CM KCR Emergency level meeting today
నేడు సీఎం కేసీఆర్ అత్యవసర స్థాయి సమావేశం
author img

By

Published : Mar 29, 2020, 7:47 AM IST

తెలంగాణలో కరోనా లక్షణాలతో వృద్ధుడు మరణించడం, పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం పట్ల వ్యాధి నిర్మూలనకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారని తెలిసింది. లాక్‌డౌన్‌ను మరింత పకడ్భందీగా అమలు చేయడం, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టే అవకాశమున్నట్లు తెలిసింది. అందుకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ప్రగతిభవన్‌లో అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం అయిదు గంటలకు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తారు. సీఎం మరికొన్ని నిర్ణయాలు ప్రకటించనున్నారని సమాచారం.

కరోనాపై సీఎం కేసీఆర్‌ శనివారం సమీక్షించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో చర్చించారు. కరోనా లక్షణాలతో మరణించిన వృద్ధుని పూర్వాపరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదివారం అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశం, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లకు ఎజెండాతో పాటు మున్ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది.

ఇదీ చూడండి : ఫేస్​బుక్​ వల.. 12 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.