కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో మద్యం షాపులకు అనుమతులు సహా కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సడలింపులపై ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురితో ఫోన్‌లో మాట్లాడారు. సడలింపుల పరిణామాలు, పర్యవసానాలపై చర్చించారు.
శాసన సభ్యులు, మండలి సభ్యులతో దీనిపై మాట్లాడారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు ప్రజాప్రతినిధులను అడిగారు. ఆది, సోమవారాల్లోనూ ఉన్నతాధికారులు, వివిధ వర్గాల మనోగతాలను సీఎం ఆరా తీసే అవకాశం ఉంది.
మరోవైపు సడలింపులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు నిఘా వర్గాలను రంగంలోకి దించారని తెలిసింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కరోనాపై సమీక్ష నిర్వహించారు. కేసుల వివరాలు, ఇతర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడారు.
ఇదీ చూడండి: అజరామరం.. మరికొద్దిసేపట్లో గాంధీ వైద్యులు, సిబ్బందిపై పూల వర్షం