రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉందని అసెంబ్లీలో దళిత బంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64 శాతం ఎస్సీ జనాభా ఉందన్నారు. అనేక జిల్లాల్లో దళితుల జనాభా 20 శాతం దాటిందని పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 17.53 శాతం మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
బీసీ గణన జరగాలి..
బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనని (KCR ON BC CENSUS) ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కులగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని శాసనసభ వేదికగా సీఎం పేర్కొన్నారు.
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం..
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గిరిజనులకు భూములు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గిరిజనులను అడ్డంపెట్టుకుని అటవీభూములు కొట్టేసేవారు ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
ఇదీచూడండి: cm kcr speech in assembly: 'మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తాం'