ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం - cm kcr decision to organize Kanti velugu program

Kanti velugu programme: రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు మళ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజారోగ్యంపై వైద్యఆరోగ్య శాఖ, ఇతర మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

కంటి వెలుగు
కంటి వెలుగు
author img

By

Published : Nov 17, 2022, 4:14 PM IST

Updated : Nov 17, 2022, 4:55 PM IST

Kanti velugu programme: ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ రివ్యూలో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం మరలా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రహదార్ల పరిస్థితి, పాడైన వాటికి మరమ్మతులతో పాటు పనుల నాణ్యత విషయమై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదార్లు, భవనాలు... పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు, పాడైన రహదార్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణతో పాటు పనుల నాణ్యత పెంచే దిశగా... రోడ్లు, భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు, తదితర కార్యాచరణపై సీఎం చర్చించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.