Nikhat Zareen Won Gold Medal In World Women Championship: ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంఫియన్‌షిప్‌లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. బాక్సింగ్ విభాగంలో ఇలా నాలుగు స్వర్ణాలు గెలుపొందడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచి.. హైదరాబాదీ అమ్మాయి నిఖిత్ జరీన్ దిగ్గజ బాక్సర్ మేరికోమ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. గతంలో 52 కేజీల విభాగంలో పోటీ పడిన బంగారు పతకం గెల్చుకున్న జరీన్.. ఈసారి 50 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో పోటీ పడి మరోసారి తానే ఛాంపియన్ అని నిరూపించుకుంది.
నిఖత్ జరీన్‌కు సీఎం అభినందనలు: న్యూదిల్లీలోని కే.డీ.జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించిన నిఖత్ జరీన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఫిప్‌లో భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన.. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని అన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో తన కెరీర్లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. క్రీడాభివృద్దికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మంత్రి హరీశ్‌రావు సైతం నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపారు. నిన్ను చూసి దేశం గర్విస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రపంచ ఛాంపియన్ షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలుపొందడంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదిక ద్వారా అభినందనలు తెలిపారు. అనంతరం రెండోసారి ఛాంపియన్షిప్ సాధించడం పట్ల సంతోషంగా ఉందని నిఖత్ జరీన్ హర్షం వ్యక్తం చేసింది. తన వెన్నంటే నడిచిన గురువు భాస్కర్, కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ విజయంపై నిఖత్ జరీన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
-
Hearty Congratulations @nikhat_zareen for gold medal 🥇 in Women’s World Boxing Championship by knocking out the opponent with powerful punches!
— Harish Rao Thanneeru (@BRSHarish) March 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
That’s second successive Women's World Boxing Championship title for Nikhat. India 🇮🇳 is proud of your achievements. pic.twitter.com/9jupaXGq0V
">Hearty Congratulations @nikhat_zareen for gold medal 🥇 in Women’s World Boxing Championship by knocking out the opponent with powerful punches!
— Harish Rao Thanneeru (@BRSHarish) March 26, 2023
That’s second successive Women's World Boxing Championship title for Nikhat. India 🇮🇳 is proud of your achievements. pic.twitter.com/9jupaXGq0VHearty Congratulations @nikhat_zareen for gold medal 🥇 in Women’s World Boxing Championship by knocking out the opponent with powerful punches!
— Harish Rao Thanneeru (@BRSHarish) March 26, 2023
That’s second successive Women's World Boxing Championship title for Nikhat. India 🇮🇳 is proud of your achievements. pic.twitter.com/9jupaXGq0V
-
The Indian Flag once again flys high at the Women’s World Boxing Championship.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations @nikhat_zareen on clinching Gold and making India proud. 🇮🇳 pic.twitter.com/b80iyzGy26
">The Indian Flag once again flys high at the Women’s World Boxing Championship.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 26, 2023
Congratulations @nikhat_zareen on clinching Gold and making India proud. 🇮🇳 pic.twitter.com/b80iyzGy26The Indian Flag once again flys high at the Women’s World Boxing Championship.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 26, 2023
Congratulations @nikhat_zareen on clinching Gold and making India proud. 🇮🇳 pic.twitter.com/b80iyzGy26
ఇవీ చదవండి: