ETV Bharat / state

సమీక్షకు వేళాయె: ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో నేడు సీఎం భేటీ

author img

By

Published : Jul 20, 2020, 7:17 AM IST

Updated : Jul 20, 2020, 8:23 AM IST

నీటిపారుదల శాఖ పునర్ ​వ్యవస్థీకరణ ముసాయిదాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు, ఇంజినీర్లతో భేటీ కానున్న సీఎం.. ఇంజనీర్ల వర్క్ షాప్ ద్వారా తయారు చేసిన ముసాయిదాపై చర్చిస్తారు.

cm-kcr-comprehensive-discussion-about-irrigation-department-in-pragathi-bhavan-today
'అన్ని ఎత్తిపోతల విభాగాలు... ఒకే గొడుకు కిందకి'

రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్... రెండు రోజుల వరుస సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్​లో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.

నీటిపారుదల శాఖ పునర్​ వ్యవస్థీకరణ ముసాయిదాపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత బాగా పెరిగిన నేపథ్యంలో... ఈ శాఖను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భారీ, మధ్య, చిన్న తరహా ఎత్తిపోతల విభాగాలుగా కాకుండా... అంతా ఒకే గొడుకు కిందికి తీసుకురావాలని సంకల్పించారు. పటిష్ఠ పర్యవేక్షణ కోసం చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో 15-20 ప్రాదేశిక భాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులు, జలాశయాలు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాములన్నీ సంబంధిత సీఈ పరిధిలోనే ఉండాలని తెలిపారు.

ఇప్పటికే ప్రాదేశిక విభాగాల విభజన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు వాటిని మ్యాపింగ్ కూడా చేశారు. కాళేశ్వరం సహా రాష్ట్రంలో భారీ ఎత్తిపోతల పథకాల నిర్వహణ అత్యంత కీలకం. పంపులు, మోటార్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలక్ట్రో-మెకానికల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ మేరకు అన్ని అంశాలతో కూడిన ముసాయిదాను రూపొందించిన అధికారులు.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్​కు సమర్పించనున్నారు. ముసాయిదాపై సీఎం సర్వ సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి: రియల్​ ఎస్టేట్​ దందా.. రెచ్చిపోతున్న కబ్జాదారులు!

Last Updated : Jul 20, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.