ETV Bharat / state

రేపు ఘనంగా సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు - telangana varthalu

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు సన్నద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. సీఎం జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోశ్‌ కుమార్‌ పిలుపుమేరకు... కోటి వృక్షార్చన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. బుధవారం రెండున్నర కిలోల బంగారు చీరను బల్కంపేట అమ్మవారికి కవిత సమర్పించనున్నారు.

రేపు ఘనంగా సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు

author img

By

Published : Feb 16, 2021, 9:00 PM IST

రేపు ఘనంగా సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం 3 లక్షల మొక్కలు నాటుతామని ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. హయత్‌నగర్‌ బాలికల గురుకులంలో మొక్కలు నాటి.... విద్యార్థినులకు నూతన దుస్తులు అందిస్తామని మంత్రి తెలిపారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో మొక్కల పంపిణీ చేపట్టారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, విమానాశ్రయం సీఈవో ప్రదీప్ పానేకర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతోష్‌ పిలుపునిచ్చారు.

బల్కంపేట అమ్మవారికి బంగారుచీర

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ... హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో అత్యంత వైభవంగా జరుపుతామని తలసాని వెల్లడించారు. రెండున్నర కిలోలతో తయారు చేయించిన బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత బల్కంపేట అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి తెలిపారు. 300మంది మహిళలకు చీరలు అందజేస్తామని తెలిపారు. మసీదు, చర్చిలు, మందిరాలు, గురుద్వారాలలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. త్రీడీలో కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ విడుదల చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

ముందస్తుగానే వేడుకలు

పలుచోట్ల ముందస్తుగానే జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ స్వగ్రామమైన కొదురుపాకలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తెరాస శ్రేణులు ఏర్పాట్లు చేశారు. నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో తెలంగాణ ఉద్యమకారుడు బాలరాజు.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి.. మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

భారీ వేడుకలకు సన్నాహాలు

వరంగల్ తూర్పు నేతలు భారీ వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో.. నగరంలోని కరీమాబాద్ పరిసరాలను గులాబీమయం చేశారు. స్థానిక వేడుకల మందిరం వద్ద 67అడుగులతో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.

సల్లంగుండు బిడ్డా... అంటూ దీవెనలు

పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామంలో వృద్ధులంతా వినూత్నంగా ముఖ్యమంత్రికి ముందస్తుగా శుక్షాకాంక్షలు తెలిపారు. 'సల్లంగుండు బిడ్డ... కేసీఆర్' అంటూ.... పంట పొలాల మధ్య ప్లకార్డులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

సిద్ధమవుతున్న అభిమానులు

రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ టోర్నమెంట్‌లు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలుతో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.