ETV Bharat / state

ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం: కేసీఆర్

author img

By

Published : Mar 26, 2021, 4:45 PM IST

Updated : Mar 26, 2021, 5:28 PM IST

రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో దేశంలోనే మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పంచాయతీరాజ్‌ కార్యదర్శులకు రెగ్యులర్‌ వేతనం ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలూ పెంచుతామని హామీ ఇచ్చారు.

CM KCR , ASSEMBLY SESSIONS
కేసీఆర్

రాష్ట్రంలో ఎలాంటి తొందరపాటు లాక్‌డౌన్‌లు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. కరోనా నియంత్రణలో దేశంలోనే మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. కొవిడ్‌ పరీక్షలు పెంచామన్న సీఎం.. నిన్న ఒక్కరోజే 70వేల టెస్టులు చేశామన్నారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని వివరించారు. ప్రతీఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. లాక్‌డౌన్‌ వదంతుల వల్ల సినీ పరిశ్రమతో పాటు అనేక మంది ఆందోళన చెందుతున్నారని .. అలాంటి అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు.

లాక్​డౌన్​పై ప్రసంగం

అప్పులు తక్కువే

రాష్ట్రంలో అప్పులు పెరిగాయన్న విపక్షాల వాదన సరికాదని సీఎం అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన అప్పులు చాలా తక్కువేనని తెలిపారు. రుణాల విషయంలో మనం దేశంలో తెలంగాణ 22వ స్థానంలో ఉందని చెప్పారు. కరోనాను తట్టుకుని తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. అప్పులతో ప్రాజెక్టులు కట్టామన్న కేసీఆర్..... వాటి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు.

అప్పులపై కేసీఆర్ ప్రసంగం

వారికి శుభవార్త

ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు శాసనసభలో ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వేతనం అందిస్తామని అన్నారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచుతామని సభలో సీఎం ప్రకటించారు.

ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులపై సీఎం ప్రసంగం

సాగు విస్తరణ

కోటి ఎకరాల మాగాణి కలగా పేర్కొన్న ముఖ్యమంత్రి... అది ఇప్పుడు కోటి 25 లక్షల ఎకరాలకు చేరుకుందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో 17.73 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

సాగు విస్తరణపై సీఎం ప్రసంగం

ఉచితంగా నీరు

తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి... ఇప్పుడు పుష్కలంగా శుద్ధమైన మంచినీటిని ఉచితంగా అందిస్తున్నామని సీఎం అన్నారు. 100 శాతం తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ వెల్లడించారు. తాగునీటి అందిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని శాసనసభలో పేర్కొన్నారు.

తాగునీటిపై కేసీఆర్ ప్రసంగం

ధరణి పోర్టల్‌

ధరణి పోర్టల్‌ విజయవంతమైందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కోటిన్నరపైగా ఎకరాలు ధరణిలో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు.

నిరుద్యోగ భృతి

దేశంలోనే... తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకే అత్యధిక వేతనాలు అందుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కరోనా పరిస్థితుల వల్లే నిరుద్యోగ భృతి అందించలేదని... విధివిధానాలు రూపొందించి... త్వరలోనే అందిస్తామన్నారు

నిరుద్యోగ భృతిపై సీఎం ప్రసంగం

రాయలసీమ ఎత్తిపోతల అంశం

నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... అవసరమైతే శాసనసభ్యులను మొత్తాన్ని తీసుకెళ్లి దిల్లీలో కూర్చుంటామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల అంశంపై సభలో భట్టి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేసీఆర్​.... నీటి అంశంలో రాజీ లేదని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టేలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆర్​డీఎస్​ విషయంలోనూ... ఏపీ ప్రభుత్వం అసంబద్ధంగా వెళ్తోందని... నీటి హక్కులను వదులుకునే ప్రసక్తి లేదన్నారు. ఆర్​డీఎస్​ నుంచి 15.9 టీఎంసీల నీటిని కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల అంశంపై కేసీఆర్ ప్రసంగం

సంక్షేమంలో నంబర్ వన్

సంక్షేమంలో తామే నంబర్ వన్‌గా ఉన్నామని సీఎం కేసీఆర్​ చెప్పారు. సంక్షేమం కోసం రూ.40 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 141 మున్సిపాలిటీల్లో వీటిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్‌పేట్ సమస్యలు చెప్పారని.. ఆ ప్రాంతాన్ని తాను స్వయంగా సందర్శిస్తానని సీఎం చెప్పారు. దేశంలో మంచి విధానాలు ఎక్కడున్నా తీసుకుంటామని కేసీఆర్​ చెప్పారు. ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్‌లో పోడు భూములకు కూడా రైతుబంధు ఇస్తామని తెలిపారు.

సంక్షేమంపై కేసీఆర్ ప్రసంగం

కేంద్రం హరిస్తోంది

విపక్షాలు మూస ధోరణిలో ఆరోపణలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్య విధానం కేంద్రం చేతుల్లో ఉంటుందన్న సీఎం.. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి సర్కారియా కమిషన్ కూడా చెప్పిందని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో కాంగ్రెస్, భాజపాల పాత్ర ఉందని విమర్శించారు. చైనా భారత్​ కంటే చాలా పేదరికంలో ఉండేదన్న ముఖ్యమంత్రి.. నూతన సంస్కరణలతో ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు.

ద్రవ్య విధానంపై కేసీఆర్ ప్రసంగం

పాతబస్తీకి మెట్రోరైల్‌

పాతబస్తీకి మెట్రో రైలు రావాల్సిందని అన్నారు. పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు ఆగిందో అందరికీ తెలుసని తెలిపారు. త్వరలో 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు అమలు చేస్తామని హామీనిచ్చారు. రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేదని వెల్లడించారు. చైనా మనకంటే చాలా పేదరికంలో ఉండేదని సీఎం సభలో అన్నారు. సంస్కరణలతో చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని స్పష్టం చేశారు.

ఒక ఏడాదిలో రూ. లక్ష కోట్ల విలువైన పంట పండించామని సీఎం అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం పెరిగాయని వెల్లడించారు. దేశంలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 55 శాతం మనదేనని చెప్పారు. ధాన్యం సేకరణ విషయాన్ని ఎఫ్‌సీఐ స్వయంగా తెలిపిందని వ్యాఖ్యానించారు.

Last Updated : Mar 26, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.