KCR on Munugode Victory: మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ నేతలకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. తెరాసపై నమ్మకంతోనే ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని సీఎం అన్నారు. మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు.
మునుగోడు ఉపఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు సీఎంకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. తెరాస గెలుపు కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా 12మంది ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.
-
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.#MunugodeWithTRS pic.twitter.com/4ECGNDoSCk
— TRS Party (@trspartyonline) November 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.#MunugodeWithTRS pic.twitter.com/4ECGNDoSCk
— TRS Party (@trspartyonline) November 7, 2022మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.#MunugodeWithTRS pic.twitter.com/4ECGNDoSCk
— TRS Party (@trspartyonline) November 7, 2022
ఇవీ చూడండి: