ETV Bharat / state

కాంగ్రెస్‌లో చేరినా తెరాసకు ఐప్యాక్‌ సేవలు: ప్రశాంత్‌ కిశోర్‌ - ప్రశాంత్‌ కిశోర్‌ తాజా వార్తలు

తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్‌ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు.

cm kcr prashanth kishor
ప్రశాంత్‌ కిశోర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌
author img

By

Published : Apr 25, 2022, 4:30 AM IST

భాజపా వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని గద్దె దింపగలమని ప్రశాంత్‌ కిశోర్‌ కేసీఆర్​కు తెలిపారు. అయితే, తాము భాజపా, కాంగ్రెస్‌లతో సమదూరం పాటిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నట్లు సమాచారం.

ఆదివారం రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్‌లో చేరినా తమ సంస్థ ఐప్యాక్‌ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను వివరించినట్లు తెలుస్తోంది.

కేంద్రం వైఫల్యాలే.. తెరాసకు ఆయుధాలు

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంపై భాజపా అంతులేని వివక్ష చూపుతోందని, విభజన హామీలను నెరవేర్చడంలో వైఫల్యంతో పాటు ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం చూపడం వంటివి తెరాసకు వచ్చే ఎన్నికల్లో పదునైన ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయని పీకే వివరించినట్లు తెలిసింది. కేంద్రం పక్షపాత ధోరణిపై రాష్ట్ర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని ఇంటింటికీ తీసుకెళ్లగలిగితే భాజపాను ప్రజలు తిరస్కరించి, తెరాసకు పట్టం కడతారని వెల్లడించినట్లు తెలిసింది. దీనిపై కార్యాచరణను సైతం పీకే నిర్దేశించారు.

కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

రాష్ట్రంలో తాము చేసిన సర్వే సారాంశాన్ని కేసీఆర్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ వివరించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని, ఈ విషయం తెరాస అధిష్ఠానం దృష్టిలో ఉందని తెలిసినా వారు మారడం లేదని, మరోసారి సిట్టింగులందరికీ సీట్లు వస్తాయనే ధైర్యంతో ఉన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయం పరిశీలించాలని పీకే సూచించినట్లు సమాచారం.

కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయిస్తూ, మరో పార్టీలోకి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారనే అంశాన్ని ఉదహరించినట్లు సమాచారం. శ్రేణులకు నిరంతర కార్యక్రమాలను నిర్దేశిస్తేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు.

త్రిముఖ పోరుతో తెరాసకు లాభం

వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోరు జరుగుతుందని, ఇది తెరాసకు లాభిస్తుందని పీకే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ల పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని తెలిపారు. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ సేవలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

సర్వేలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం, పాత, కొత్త ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహం తదితర విషయాల్లో ఐప్యాక్‌ సేవలను వినియోగించుకుంటామని చెప్పినట్లు తెలిసింది. తెరాస ప్లీనరీ అనంతరం వీరిద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో తెరాసకు పీకే సేవలు.. సరికొత్త ప్రచారానికి ప్రణాళికలు..!

డ్రాగన్​కు భారత్ ఝలక్​.. టూరిస్ట్ వీసాలు సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.