ETV Bharat / state

ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే సీఎం కేసీఆర్​ లక్ష్యం: మంత్రి తలసాని - ప్రారంభమవనున్న ఆరో విడత హరితహారం

ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన అమీర్​పేటలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్... మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తలసాని తెలిపారు.

cm-kcr-aims-to-create-green-telangana
'ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే సీఎం కేసీఆర్​ లక్ష్యం'
author img

By

Published : Jun 23, 2020, 8:21 PM IST

ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఈ నెల 25వ తేదీన అమీర్​పేట సత్యం థియేటర్ వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్... మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తలసాని తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2.50 కోట్లు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన‌ట్లు వివరించారు.

ఈ హరిత తెలంగాణ ఏర్పాటులో కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, కాలనీ సంఘాలు భాగస్వాములై... విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప‌లు నియోజవర్గాలలో మంత్రి త‌ల‌సాని పాల్గొని... మొక్కలు నాట‌నున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణ వార్షిక వృద్ధిరేటు 8.2 శాతం.. నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.