ETV Bharat / state

మళ్లీ అదే అలజడి.. అన్నొస్తున్నాడు.. దుకాణాలు తెరవద్దు - సీఎం జగన్ విశాఖ పర్యటన

CM Jagan Tour Restrictions: ఆంధ్రప్రదేశ్​లో ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటనలు అంటే చాలు చిరు వ్యాపారులు భయపడిపోతున్నారు. భద్రత, ట్రాఫిక్​ ఆంక్షల పేరుతో దుకాణాలు తెరవొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర సీఎం విశాఖలోని శారదాపీఠం సందర్శనార్థం వస్తున్న సందర్భంగా చిరు వ్యాపారులకు ఈ పరిస్థితి ఎదురైంది.

CM Jagan Tour Restrictions
CM Jagan Tour Restrictions
author img

By

Published : Jan 27, 2023, 7:06 PM IST

CM Jagan Tour Restrictions: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ఆ రాష్ట్ర సీఎం జగన్ పర్యటన అంటే నగరవాసులు భయపడుతున్నారు. శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్ శనివారం శారద పీఠానికి వస్తున్నారు. స్థానిక బీఆర్ టీఎస్ రోడ్డు నుంచి శారదాపీఠానికి వెళ్లే కిలోమీటర్ పరిధిలోని దుకాణాలను పోలీసులు భద్రత కారణాలతో మూసివేయించారు.

ఏమైనా అడిగితే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భద్రత ఏర్పాట్లు పాటించాలని, దుకాణాల తెరవొద్దని అధికారులు చెప్పారంటూ చిరువ్యాపారులు వాపోయారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చూసే అధికారులు నోటి మాట ద్వారా సీఎం జగన్ శారదా పీఠంలో కార్యక్రమాలు ముగిసే వరకు దుకాణాలు తెరవద్దని చేప్పేశారు. ఫలితంగా దుకాణాలు తెరవకుండా సీఎం పర్యటన ఎప్పుడు ముగుస్తుందా అని చిరు వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

"20 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నాం. మాకు ఈ దుకాణాలే ఆధారం. ఉద్యోగాలు, వాళ్ల లాగా ఆస్తులు పాస్తులు లేవు. ప్రతీ నెలా అన్ని రకాల పన్నులు కడుతున్నాం.. చెత్త పన్ను సైతం కడుతున్నాం. దుకాణాల నుంటి వచ్చే డబ్బుతోనే కదా కడుతున్నాం." -చిరు వ్యాపారి

"ఆటో ఢీకొని మా ఆయన చనిపోయాడు. కూరగాయలు అమ్ముకుని బతకొద్దా? షాపులు మూసివేయాలని చెప్పారు. మాకు భయమేసి షాపులు మూసి బయట కూర్చున్నాం. 3 రోజుల పాటు షాపులు మూసేయాలి. రోడ్డు వెంబడి ఎవ్వరూ నడవద్దంటే ఎలా?" -చిరు వ్యాపారి

మళ్లీ అదే అలజడి.. అన్నొస్తున్నాడు.. దుకాణాలు తెరవద్దు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.