నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM JAGAN) కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు.
అలాగే.. రెండు రోజుల పర్యటనలో ఆ రాష్ట్ర సీఎం అనంతపురం, కడప జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురం జిల్లా రాయదుర్గానికి బయలుదేరి వెళతారు. అక్కడ అధికారిక కార్యక్రమాలు ముగిసిన తరువాత రాయదుర్గం నుంచి.. మధ్యాహ్నం పులివెందుల, ఇడుపులపాయకు చేరుకుంటారు.
పర్యటన సాగనుందిలా..
- 10.40 గంటలకు రాయదుర్గం నియోజకవర్గంలోని 74 – ఉడేగోళం గ్రామానికి చేరుకుంటారు.
- రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి.. అనంతరం కస్టమ్ హైరింగ్ సెంటర్ యూనిట్స్‌ను పరిశీలిస్తారు.
- 11.20 గంటలకు రాయదుర్గం మార్కెట్ యార్డుకు చేరుకుని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ను ప్రారంభిస్తారు.
- 11.45 గంటలకు విద్యార్థులతో కలిసి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తారు. ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.
- మధ్యాహ్నం 2.10 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2.50 – 3.20 మధ్యన పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌కు చేరుకుని వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన శంకుస్ధాపన, శిలాఫలకాల ఆవిష్కరిస్తారు.
- సాయంత్రం 3.55 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు.
- సాయంత్రం 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని.. అనంతరం రాత్రి బస కోసం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
రేపు.. కడప జిల్లాలో కొనసాగనున్న పర్యటన
- ఉదయం 10.40 గంటలకు జగన్ బద్వేల్ చేరుకుంటారు.
- మధ్యాహ్నం 11.10 – 12.45 వరకు బద్వేలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 1.45 గంటలకు కడపకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2.05 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుని.. సీపీ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
- మధ్యాహ్నం 2.40 – 3.25 గంటలకు కడప మహావీర్ సర్కిల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నం 3.50 – 4.20 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు.
- ఇలా రెండు రోజుల పర్యటనను ముగించుకున్న తరువాత కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటారు.
ఇవీ చదవండి: YSRTP:నేడే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన.. సర్వం సిద్ధం