Thandel Movie Release Date : నాగచైతన్య లీడ్ రోల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తండేల్' ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌లో సాయిపల్లవి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటీలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు హాజరయ్యారు. చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. వాలెంటైన్స్ వీక్ ప్రారంభానికి ముందు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సాయి పల్లవి తనకు కుమార్తెతో సమానమని అల్లు అరవింద్ అన్నారు. తాజాగా విడుదలైన సాయిపల్లవి నటించిన 'అమరన్' చూసి ఎమోషనల్ అయినట్లు చెప్పారు. సాయిపల్లవికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య మాట్లాడారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు విడుదల తేదీని ముందుగా అనుకుని, దాన్ని బట్టి మూవీ పూర్తిచేసేవాడినని తెలిపారు. దాని వల్ల తప్పులు జరిగేవని, మూవీ మొత్తం పూర్తయ్యాక విడుదల తేదీ చెబితే బాగుండేదని అనుకునేవాడినని వెల్లడించారు. ఈ చిత్రంతో అది నెరవేరిందని తెలిపారు.
Get ready to sail from the shores of love to the ocean full of emotions ✨#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥#ThandelonFeb7th - https://t.co/KSkvscE3co #Dhullakotteyala 🔥🤙
— Geetha Arts (@GeethaArts) November 5, 2024
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/TQBEOWLK1q
'సాయి పల్లవి క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్'
"అల్లు అరవింద్ కూడా నాలానే ఆలోచించారు. చాలా ఆనందించాను. ఇది గొప్ప సినిమా. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. ఈ మూవీ ఎప్పుడు విడుదల చేసినా అది పండగే అవుతుంది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. నేను చేస్తానని బన్నివాసుని అడిగాను. పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను స్క్రీన్‌పై బాగా చూపించాలని దర్శకుడు చందూ కష్టపడ్డారు. ఆయన నాకు మంచి స్నేహితుడితో సమానం. సాయి పల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆమె 'క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్' " అని ప్రశంసలు కురిపించారు నాగ చైతన్య.
'ఆయన నన్ను కుమార్తెగా భావిస్తారు'
'అమరన్'ను ఊహించని విధంగా ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హిరోయిన్ సాయి పల్లవి. 'నన్ను అల్లు అరవింద్ గారు ఎప్పుడూ కుమార్తెగా భావిస్తారు. 'తండేల్' రియల్ లైఫ్ స్టోరీ. ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. చిత్ర బృందం అంతా ఎంతో కష్టపడింది. నాగ చైతన్య సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్ట్‌లోనే బిజీగా ఉన్నారు. మరో ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచించలేదు. ఇలాంటి నటుడిని నేను ఇప్పటివరకు చూడలేదు' అని సాయిపల్లవి చెప్పారు.
'మేము అలా చేసి ఉండకూడదు- కానీ తప్పలేదు'- షారుక్‌కు సారీ చెప్పిన 'సలార్' డైరెక్టర్
'మహానటి' కథ వినకముందే రిజెక్ట్ చేసిన దుల్కర్! మళ్లీ ఎందుకు నటించారు? నాగ్ అశ్విన్ రివీల్!