ETV Bharat / state

గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్​: ఏపీ సీఎం జగన్ - cm jagan latest news

గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల అంశంపై ఏపీ సీఎం జగన్​మోహన్ రెడ్డి సమీక్షి నిర్వహించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్​: ఏపీ సీఎం జగన్

author img

By

Published : Jan 22, 2021, 8:01 PM IST

గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అంతరాయాలు లేని ఇంటర్నెట్ అందించాలన్నదే లక్ష్యం కావాలన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల అంశంపై సమీక్షించిన సీఎం.. పలు సూచనలు చేశారు. కేబుల్స్‌ తెగి అవాంతరాలు వచ్చే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికీ అన్‌ లిమిటెడ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు.

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నెట్‌వర్క్‌ తీసుకురావాలన్న సీఎం జగన్... భూగర్భ కేబుల్‌ వేసేలా ఆలోచన చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ నెట్‌ కోసం సరైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. దీని వల్ల సొంత గ్రామాల్లోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

అమ్మ ఒడి, వసతిదీవెన లబ్ధిదారుల్లో ఆప్షన్‌గా కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌ అందించడంపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. 9 నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులకు ఆప్షన్‌గా ల్యాప్‌ టాప్‌ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలు పూర్తిగా తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ల్యాప్‌టాప్‌ చెడిపోతే, దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలని లేదా రీప్లేస్‌ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. అందుకే కంపెనీ మెయింటెనన్స్‌ను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు..

ఇదీ చదవండి: ఆయిల్​ఫామ్ సాగుతో ఆశించిన లాభాలు: పోచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.