ETV Bharat / state

AP CM Jagan: గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్​షీట్ నుంచి తొలగించండి - ఏపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్​బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్​షీట్ నుంచి తన పేరు తొలగించాలని డిశ్చార్జ్​ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సెప్టెంబర్​ 3వ తేదీకి వాయిదా పడింది.

AP CM Jagan
jagan
author img

By

Published : Aug 28, 2021, 9:48 AM IST

అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్​బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరుతూ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ పేర్కొన్నారు. అదే ఛార్జ్ షీట్​లో రెండో నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోరుతూ డిశ్ఛార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ సెప్టెంబరు 3వ తేదీకి వాయిదా పడింది. పెన్నా కేసులో జగన్ డిశ్ఛార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్ షీట్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ.రాజగోపాల్ డిశ్ఛార్జ్ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 1వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఇదీచదవండి.: డ్రగ్స్​ కేసులో మరో నటుడు అరెస్ట్​

CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.