ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ డేటా క్రోడీకరణ పనిని ప్రత్యేకంగా ఒకరికి అప్పగించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ సూచించారు. ఈ పనిని గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌కు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్షించిన జగన్.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. డేటా క్రోడీకరణను మండల స్థాయి ఉద్యోగి పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆర్బీకేల పరిధిలోని ఈ–క్రాపింగ్ డేటానూ కూడా తీసుకోవాలని చెప్పారు. డేటా సేకరణే కాదు, కార్యాచరణపైనా దృష్టి సారించాలన్నారు. మెరుగైన సేవలందించిన వాలంటీర్లకు ఉగాది రోజు సత్కారం చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
సుస్థిర సమగ్రాభివృద్ధికి ఐరాస 17 లక్ష్యాలు నిర్దేశించిందని జగన్‌కు అధికారులు తెలిపారు. 17 లక్ష్యాలు అందుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ విషయంలో లక్ష్య సాధనకు ఐరాస, అనుబంధ విభాగాల సాయం తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోతో కలిసి పని చేయాలన్నారు.
- ఇదీ చూడండి : జీవశాస్త్రాల పురోగతికి ఔషధం