CM Breakfast Scheme in Telangana 2023 : దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్రప్రభుత్వం చర్యలుచేపట్టింది. కొత్తగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేయడంతోపాటు.. సుమారు రూ.7000 కోట్లు వెచ్చించి మనఊరు- మనబడి(Mana Vuru-Mana Badi) ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మధ్యాహ్నం భోజనం(Midday Meals Scheme) ద్వారా చిన్నారుల కడుపు నింపుతున్న సర్కారు... బడికి వచ్చే సమయంలో ఏం తినకుండా వస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి(CM Breakfast Scheme) శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా ర్యావిలాల పాఠశాలలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా.. దసరా సెలవుల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్న మంత్రులు.. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు.
CM Breakfast Scheme Started in Telangana : అల్పాహార పథకం పేద పిల్లలకు వరమన్న మంత్రులు.. మఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా దానివెనక ఓ మానవీయ కోణంఉందని పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తిని.. కాసేపు వారితో ముచ్చటించారు. వారికి మంత్రి కేటీఆర్ అల్పాహారాన్ని వడ్డించారు. ఇలాగే విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. రోజుకో పౌష్టికాహారాన్ని వడ్డించనున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని అన్నారు.
Thombarraopet Govt School In Jagityala : ప్రైవేటు వద్దు.. సర్కారు బడే ముద్దు..
Telangana CM Breakfast Scheme in Govt Schools : పథకం అమలు పర్యవేక్షణ బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో.. మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఈ పథకం ద్వారా 27,147 పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే.. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుందని మంత్రులు వివరించారు. ప్రతిరోజు పాఠశాల ప్రారంభానికి.. 45 నిమిషాల ముందు అల్పాహారాన్ని వడ్డిస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి విధిగా అల్పాహారాన్ని తిని.. ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.
CM Breakfast Menu List : సోమవారం ఇడ్లీ-సాంబారు లేదా గోధుమరవ్వ, మంగళవారం పూరి, ఆలు కుర్మ లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా-సాంబారు లేదా బియ్యం కిచిడి, గురువారం చిరు ధాన్యాలతో చేసే ఇడ్లీ-సాంబరు లేదా పొంగల్-సాంబారు, శుక్రవారం ఉగ్గాని లేదా చిరు ధాన్యాల ఇడ్లీ, శనివారం పొంగల్ సాంబారు లేదా కూరగాయలతో చేసిన పులావ్ వడ్డిస్తామని చెప్పారు.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ మెనూ పట్టిక :
వారం | ఐటెమ్స్ |
సోమవారం | ఇడ్లీ-సాంబారు లేదా గోధుమరవ్వ |
మంగళవారం | పూరి, ఆలు కుర్మ లేదా టామటా బాత్ |
బుధవారం | ఉప్మా-సాంబారు లేదా బియ్యం కిచిడీ |
గురువారం | చిరుధాన్యాలతో చేసే ఇడ్లీ-సాంబారు లేదా పొంగల్-సాంబారు |
శుక్రవారం | ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ |
శనివారం | పొంగల్ సాంబారు లేదా కూరగాయలతో చేసిన పులావ్ |