ETV Bharat / state

నేడు సీఎల్పీ భేటీ...అసెంబ్లీ సమావేశాలపై చర్చ

కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో నేడు సీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్త పురపాలక చట్టం బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

author img

By

Published : Jul 18, 2019, 5:03 AM IST

Updated : Jul 18, 2019, 7:51 AM IST

Clp_Meeting_Today

కొత్త పురపాలక చట్టం ఆమోదం కోసం ఇవాళ, రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందుగాని లేదా సభలో కొత్తచట్టం ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్త చట్టానికి సంబంధించిన పలు అంశాలను పరిశీలించి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రభుత్వం తమ అభ్యంతరాలకు సానుకూలంగా స్పందించకపోతే ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రోజులే కాకుండా సభను వారం పాటు నిర్వహించాలని కోరే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

నేడు భేటీకానున్న సీఎల్పీ

ఇవీ చూడండి: కుట్రపూరిత విధానాలను ఎండగట్టినట్లయింది..

Intro:Body:Conclusion:
Last Updated : Jul 18, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.