ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈరోజు ప్రమోషన్​- ఇష్ట దేవతారాధన శుభకరం!

Horoscope Today 10th October 2024 : 2024 అక్టోబర్ 10వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Horoscope Today 10th October 2024
Horoscope Today 10th October 2024 (ETV Bharat)

Horoscope Today 10th October 2024 : 2024 అక్టోబర్ 10వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి లేకపోవడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ విషయాలలో కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిది. చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా ఉంటే అవే సర్దుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో హోదా పెరగడం వల్ల సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రలకు వెళతారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నలుగురికి ఆదర్శంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఉద్యోగులకు ఫలప్రదంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు పొందుతారు. కుటుంబలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపార పరంగా పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వెన్నంటే ఉంటుంది. దైవబలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఈ రోజు రచయితలకు, కళాకారులకు ఫలప్రదంగా ఉంటుంది. అమోఘమైన కల్పనాశక్తితో రచనలు చేసి సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఇంటా బయటా సహచరులతో కలహాల కారణంగా ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంటా బయటా ఎలాంటి సహకారం ఉండదు. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది. శని స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెచ్చించి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పని పట్ల మీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. సంపదలు వృద్ధి చెందుతాయి. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. వ్యాపారులు వ్యాపార విస్తరణకు, నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. శ్రీ విజయలక్ష్మీ దేవి ఆరాధనతో మరిన్ని శుభ ఫలితాలుంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కూడా ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కీలక వ్యవహారంలో న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా తగిన జా గ్రత్తలు తీసుకోండి. దుర్గాస్తుతి పారాయణ శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో భారీ నష్టాలు ఉండే ప్రమాదముంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా గడుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యా త్మి కమైన కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల కోసం విరివిగా ఖర్చు చేస్తారు. అపాత్ర దానం చేయవద్దు. కోర్టు, న్యాయ పరమైన విషయాలలో శ్రద్ధ పెట్టకపోతే నష్ట పోతారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సమాజంలో ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరగవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, పదోన్నతులు ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. వరుస అపజయాలతో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆరోగ్యం బాగుండదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. వీలైనంత వరకు ప్రశాంతంగా గడపండి. ఇతరుల వ్యక్తిగత విషయాల జోలికి వెళితే పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లవచ్చు. శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.