ETV Bharat / sports

రెండో టీ20లోనూ బంగ్లాపై భారత్​దే విజయం - టీ20 సిరీస్​ కైవసం - IND VS BAN 2ND T20

IND VS BAN 2nd T20 : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లోనూ భారత్​దే విజయం!

source Associated Press
IND VS BAN 2nd T20 (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 9, 2024, 10:28 PM IST

Updated : Oct 9, 2024, 10:34 PM IST

IND VS BAN 2nd T20 : బంగ్లాదేశ్‌తో టీమ్​ ఇండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్​లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రెండో మ్యాచ్​లోనూ భారీ విజయం సాధించింది. ఏకంగా 86 పరుగులు తేడాతో గెలుపొందింది.

222 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ విజయంతో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తద్వారా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్​ను దక్కించుకుంది. అంతకుముందు బంగ్లాతో జరిగిన మూడు వన్డేల సిరీస్​ను కూడా క్లీన్​ స్వీప్ చేసింది భారత్​.

లక్ష్య ఛేదనలో బంగ్లా ఇన్నింగ్స్​లో మహ్మదుల్లా 41 పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్​, వాషింగ్​టన్ సుందర్​, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.

ఇదే మ్యాచ్​లో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు ఆల్‌ రౌండర్ నితీశ్‌ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అదరగొట్టాడు. మరో ప్లేయర్ రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపులు మెరిపించాడు. స్టార్ ఆల్​ రౌండర్​ హార్దిక్ పాండ్య (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచిగానే రాణించాడు. ఓపెనర్లు సంజు శాంసన్ (10), అభిషేక్ శర్మ(10) మొదటి మూడు ఓవర్లలోనే పెవిలినయ్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ (8) కూడా నిరాశ పరిచాడు. బంగ్లాదేశ్​ బౌలర్లలో తస్కిన్, తంజిమ్, ముస్తాఫిజుర్, రిషాద్ తలో రెండు వికెట్లు తీశారు.

తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ ఊచకోత - టీమ్ ఇండియా భారీ స్కోర్‌

టీ20 ర్యాంకింగ్స్​లో అర్షదీప్ రేర్ రికార్డు - టాప్‌-10లోకి ఫస్ట్​టైమ్​!

Last Updated : Oct 9, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.