ETV Bharat / state

అసెంబ్లీ కోసం పని విభజించుకున్న కాంగ్రెస్ నేతలు - అసెంబ్లీ కోసం కాంగ్రెస్ నేతలు

శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్​తో అబద్ధాలను చదివించారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం దాదాపు రెండు గంటల పాటు సమావేశమైంది.

Clp meeting on assembly sessions
పని విభజించుకున్న కాంగ్రెస్ నేతలు
author img

By

Published : Mar 6, 2020, 8:51 PM IST

బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో అంశాల వారీగా చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం పని విభజన చేసుకుంది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సీఎల్పీ భేటీలో పలు అంశాలపై చర్చించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హాజరయ్యారు.

పని విభజించుకున్న కాంగ్రెస్ నేతలు

అంశాల వారీగా పని విభజన..

బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన సభ్యులు అంశాల వారీగా పని విభజన చేసుకున్నారు. శాఖల వారీగా ఆయా ఎమ్మెల్యేలకు పట్టున్న అంశాలపై సభలో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేయాలని సీఎల్పీ నేత భట్టి సూచించారు. పాలనాపరమైన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. అంశాలు వారీగా సీఎల్పీ నేత భట్టి పని విభజన చేశారు.

అంశాలుఎమ్మెల్యేలు
నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు భట్టి, శ్రీధర్
రెండు పడక గదుల ఇళ్లుజగ్గారెడ్డి
పురపాలక, నీటి పారుదల శాఖలురాజగోపాల్ రెడ్డి
విద్య, గిరిజన సంక్షేమంసీతక్క
గిరిజన సంక్షేమం, బెల్ట్ షాప్​లు, పబ్పొదెం వీరయ్య

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ ఎఫెక్ట్: క్లీన్​గా మారిన నాగర్​కర్నూల్ కలెక్టరేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.