CLP Leader Bhatti Vikramarka: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో జూన్ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి నవ సంకల్ప్ మేధోమధన శిబిర్‌లో వివిధ అంశాలను చర్చించేందుకు 6కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు ఈ కమిటీలకు కన్వీనర్‌లుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కమిటీలో 25నుంచి 30మంది సభ్యులుంటారని భట్టి చెప్పారు.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్, పొలిటికల్ కమిటీకి కన్వీనర్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. వ్యవసాయ కమిటీ కన్వీనర్‌గా జీవన్ రెడ్డిని నియమించామని పేర్కొన్నారు. యూత్ కమిటీ కన్వీనర్ దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి కన్వీనర్ శ్రీధర్‌బాబు.. సోషల్ జస్టిస్ కమిటీకి కన్వీనర్‌గా వీహెచ్‌ను నియమించినట్లు చెప్పారు. మొదటి రోజు కమిటీల్లో చర్చించిన అంశాలను పీఏసీలో తీర్మానం చేస్తామని తెలిపారు. సభ్యులు రాత పూర్వకంగా కూడా సలహాలు ఇవ్వొచ్చని భట్టి పేర్కొన్నారు.
"కమిటీలన్ని జూన్ 1 నాడు తీసుకున్న నిర్ణయాలను, 2వ తేదీన ఒక్కొక్క గ్రూప్ గంటపాటు చర్చించి తీసుకున్న నిర్ణయాలను మాకు సమర్పిస్తారు. అంతిమంగా వాటిని పీఏసీలో చర్చించి వాటిపై తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తాం. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఏ విధంగా ఏజెండా రూపొందించాలో నిర్ణయిస్తాం." -భట్టి విక్రమార్క, సీఏల్పీ నేత
ఇదీ చదవండి: హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి