సర్కారీ భూముల అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఆక్షేపించింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చి భూములను అమ్ముతున్నారని, చివరకు రాష్ట్రాన్ని తనఖా పెడతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు.
జిల్లాకు వెయ్యి ఎకరాల చొప్పున 33 వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మడానికి సిద్ధమయ్యారని భట్టివిక్రమార్క సీఎం కేసీఆర్ (Cm Kcr)కు రాసిన లేఖలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ భూములను కాపాడుకోలేక వాటిని అమ్ముకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉంచుకుని భూములను కాపాడుకోలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: KCR review: గ్రామ పంచాయతీలు, పురపాలికల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం కేసీఆర్ సమీక్ష