ETV Bharat / state

Bhatti Vikramarka:' ఉపఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం' - telangana varthalu

తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతో... ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్​ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితంగా కొట్టిపారేశారు.

Bhatti Vikramarka: ' ఉపఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం'

author img

By

Published : Oct 23, 2021, 5:20 PM IST

హుజూరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాలు కలిసిపోయాయన్నది అవాస్తవమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హుజురాబాద్‌లో ఓడిపోతామనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్​ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు భిన్న ధృవాలు ఎలా కలుస్తాయన్న ఆయన.. కేటీఆర్​ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఈటలపై విచారణ ఎటుపోయిందని ప్రశ్నించిన భట్టి... ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితంగా కొట్టిపారేశారు. కేటీఆర్​ రేవంత్​రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెరాసకు పట్టడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూడలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని భట్టి పేర్కొన్నారు. హుజూరాబాద్​లో దళితబంధును ఆపడంలో భాజపా, తెరాస పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. దళితబంధుపై భాజపా వైఖరి సరిగా లేదని భట్టి విమర్శించారు. హైదరాబాద్​ నిండా తెరాస ఫ్లెక్సీలు నింపారన్న భట్టి... ప్రతిపక్షాల ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపా, తెరాస దోపిడి దొంగల గెలుపుకోసం పోటీ పడుతున్నాయన్నారు. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరని.. కాంగ్రెస్‌ భావజాలం ఉన్నవారే ఉంటారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడం సరికాదన్నారు.

' ఉపఎన్నిక తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం'

కాంగ్రెస్, భాజపా కలిసి హుజూరాబాద్ ఎన్నికల్లో కలిసిపోయారని కేటీఆర్ మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ నాయకులపై బురదజల్లే మాటలు ప్రజలు నమ్మరు. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలి. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలను హుజూరాబాద్​ ప్రజలు నమ్మరు. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.