ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. నిధులు వినియోగంపై అధికారులు, ప్రజాప్రతినిధులో సమావేశమై.. సమర్థంగా ఉపయోగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
జనాభా పెరుగుదల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంపుపై జీవో జారీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని భట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనుల జనాభా పెరిగినందున.. వారికి రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరారు. దీనికి కేంద్ర అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.