Bhatti Vikramarka on Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయం విషయంలో చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తిప్పికొట్టారు. భాగ్యలక్ష్మీ ఆలయం బండి సంజయ్ ఒక్కడిదే కాదని.. అమ్మవారిని నమ్మేవారందరిదని భట్టి స్పష్టం చేశారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలలో అన్ని మతాల వారుంటారని.. ఎవరో చేసిన పనికి పార్టీ బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ ఆలయం గురించి కాంగ్రెస్ ఏదైనా మాట్లాడిందా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని నమ్ముతుందని.. భాజపా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. జనం మీద మనువాదాన్ని రుద్దాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"భాగ్యలక్ష్మీ ఆలయం అనేది అమ్మవారిని నమ్మే వారందరిది. ఇదేదో బండి సంజయ్దో, భారతీయ జనతా పార్టీదో కాదు ఇది. బండి సంజయ్ అమ్మవారిని నమ్మే వారందరిని బయటకు నెట్టేసి ఆలయంపై గుత్తాధిపత్యం సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా ఇక్కడ కూడా మతాలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించి అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలలో అన్ని మతాల వారుంటారని.. ఎవరో చేసిన పనికి పార్టీ బాధ్యత ఎలా అవుతుంది. నీకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందా?." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చదవండి: