ETV Bharat / state

Bhatti On Assembly: ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం: భట్టి

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు జరగలేదన్నారు.

author img

By

Published : Mar 6, 2022, 10:08 PM IST

Updated : Mar 6, 2022, 10:52 PM IST

Bhatti On Assembly sessions
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాజ్యాంగానికి భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చేయాలంటే ఏదో అనుకున్నామని.. చివరికి గవర్నర్​ ప్రసంగం లేకుండా చేశారని అన్నారు. హైదరాబాద్​లోని తాజ్​దక్కన్​లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై భట్టి విమర్శలు గుప్పించారు.

బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రజాసమస్యలపై చర్చకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా గతంలో ఎన్నడూ బడ్జెట్ సమావేశాలు జరగలేదన్నారు. ప్రసంగం లేకుండా అన్ని చేశామని చెబితే ఏలా నమ్మాలని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దళిత బంధు, నిత్యావసర ధరలు, మెట్రో రైలు విస్తరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

'రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్​ చేయటం వల్ల ఆలస్యం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను రాకుండా చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో చెప్పాలి. నిజామాబాద్​లో ఏ పంట పండినా కొనాలని సీఎం చెప్పారు. మరీ ఇప్పుడేమో వరి వేస్తే ఉరి అంటున్నారు. దళితబంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి. పోడు భూములకు సంబంధించి పరిష్కారం చూపాలి. కొవిడ్ బాధితులకు ఇచ్చే పరిహారం అందించాలి. ఎస్సీలకు మూడెకరాలు ఇస్తామని గత ప్రభుత్వాలు ఇచ్చిన వాటిని కూడా లాక్కుంటున్నారు. ప్రభుత్వ భూములు అమ్మటం సరికాదు. రైతులకు మద్దతు ధర లభించడం లేదు.' - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Last Updated : Mar 6, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.