కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అవి ఇప్పటికే 80 నుంచి 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.
ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే..
చివరి దశకు చేరిన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు రూ. 42 వేల కోట్లు అవసరమన్నారు. పాత, కొత్త ప్రాజెక్టులు పూర్తిచేయక ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు. కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలకే నష్టమన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తికాకపోతే కలిగే నష్టాలను తెలిపేందుకే నిరసన దీక్ష అని వెల్లడించారు.
ఇదీ చూడండి : ఐటీ ఎగుమతుల్లో తెలంగాణకు లేదు పోటీ!