ETV Bharat / state

ప్రజలను భ్రమల్లో ఉంచి పరిపాలన చేస్తున్నారు: భట్టి - భట్టి విక్రమార్క వార్తలు

కాంగ్రెస్​ హయాంలోనే హైదరాబాద్​ అభివృద్ధి చెందిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మౌలిక వసతులు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజలను భ్రమల్లో ఉంచి తెరాస ప్రభుత్వం పరిపాలన చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్​ నెలకొల్పిన సంస్థలతోనే ఉపాధి అవకాశాలు పెరిగాయని వెల్లడించారు.

batti vikramarka
batti vikramarka
author img

By

Published : Sep 16, 2020, 3:46 PM IST

హైదరాబాద్‌లో మౌలిక వసతులు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. నగరానికి 3 దశల్లో కృష్ణా జలాలు తెచ్చిన ఘనత కూడా అప్పటి తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తెచ్చినట్లు పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. శాసనసభలో హైదరాబాద్​ అభివృద్ధిపై చర్చలో భట్టి మాట్లాడారు.

ప్రజలను భ్రమల్లో ఉంచి తెరాస ప్రభుత్వం పరిపాలన చేస్తోందని భట్టి విమర్శించారు. హైదరాబాద్‌కు బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌ ఎవరు తెచ్చారని నిలదీశారు. కూకట్‌పల్లి, వనస్థలిపురంలో అనేక కాలనీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు రక్షణరంగ సంస్థలు తెచ్చిన ఘనత మాదే. బీఈఎల్‌, నిఫ్ట్‌, న్యాక్‌లు మేమే తెచ్చాం. హెచ్‌సీయూ, ఉన్నతవిద్యా సంస్థలు మా హయాంలోనే వచ్చాయి. ఓయూ, జేఎన్‌టీయూ, ఐఐటీని క్రమంగా అభివృద్ధి చేసిన ఘనత మాదే. ఈ సంస్థలన్నీ వచ్చాయి కనుకే ఉపాధి అవకాశాలు పెరిగాయి. హైటెక్‌ సిటీ వచ్చాక మరిన్ని ఉద్యోగాలు వచ్చాయి.

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ప్రజలను భ్రమల్లో ఉంచి పరిపాలన చేస్తున్నారు: భట్టి

ఇదీ చదవండి : శాసనమండలి నిరవధిక వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.